Homeలైఫ్ స్టైల్బిగ్‌బాస్ 10 వచ్చేస్తోంది.. ఈసారి ఆటలో కాదు.. ఆటే సవాల్...!

బిగ్‌బాస్ 10 వచ్చేస్తోంది.. ఈసారి ఆటలో కాదు.. ఆటే సవాల్…!

హైద‌రాబాద్‌,క్రైమ్ మిర్ర‌ర్‌: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు కొత్త సీజన్‌కు అధికారికంగా తెరలేచింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10ను స్టార్ హీరో నాగార్జున ప్రత్యేక ప్రోమో ద్వారా ప్రకటించారు. ఆటలో సవాల్ కాదు.. ఈసారి ఆటే సవాల్ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాంప్రదాయ రాజభవనాన్ని తలపించే సెట్స్, గ్రాండ్ విజువల్స్, మాస్ డ్యాన్స్ నంబర్స్‌తో రూపొందించిన ఈ ప్రోమోలో నాగార్జున మరోసారి తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన రాజ్యం మాత్రమే కాదు.. లక్షలాది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అభిమానులను అలరిస్తోంది.

గత తొమ్మిది సీజన్లతో పోలిస్తే ఈసారి షో మరింత భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు నిర్వాహకులు సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా టాస్కులు, గేమ్‌ప్లాన్, హౌస్ డిజైన్, కంటెస్టెంట్ల ఎంపికలో కొత్తదనం ఉండబోతుందనే చర్చ నడుస్తోంది.

గత సీజన్ ప్రత్యేక ఆకర్షణగా సామాన్యులకు కూడా బిగ్‌బాస్ హౌస్‌లో అవకాశం కల్పించడం నిలిచింది. అగ్నిపరీక్ష పేరుతో నిర్వహించిన ఎంపిక ప్రక్రియ ద్వారా పలువురు కామనర్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా, వారిలో ఒకరు విజేతగా నిలవడం విశేషం. దీంతో ఈసారి కూడా సామాన్యులకు అవకాశం ఉంటుందా లేదా అన్న అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు? షో ప్రారంభ తేదీ ఎప్పుడు? సామాన్యులకు మళ్లీ అవకాశం కల్పిస్తారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇంకా వెల్లడి కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం విడుదలైన ప్రోమో మాత్రం బిగ్‌బాస్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. మరి ఈసారి ఆటే సవాల్ అనే కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ ఎలాంటి సరికొత్త అనుభవాన్ని అందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు