Uncategorized

ఇంధన కంట్రోల్ స్విచ్ కట్ చేయడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ప్రమాదం ముందు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో ఏం జరిగింద్న విషయంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు కీలక సమాచారం లభించింది. తమకు దొరికిన ఆధారాలతో అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదానికి గల కారణం తెలిపింది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించింది.

ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో ఏ క్షణానికి ఏం జరిగిందన్న వివరాలను తమ నివేదికలో వెల్లడించింది AAIB. విమానం గరిష్ఠ వేగమైన 180 నాట్స్‌ను అందుకున్న మరుక్షణమే ‘రన్’ నుంచి ‘కటాఫ్’ పొజిషన్‌కు మారిన ఇంజిన్ 1, ఇంజిన్ 2కు చెందిన ఇంధన స్విచ్లు. ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజిన్లు రెండూ టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ రావడంతో.. స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్‌ను ప్రశ్నించగా తాను చేయలేదని తెలిపాడు మరో పైలట్. దీంతో ఎయిర్‌పోర్టు పెరీమీటర్ గోడను దాటిన వెంటనే ఎత్తు తగ్గుతూ కిందకు వచ్చింది విమానం

అయితే మొదటి ఇంజిన్, రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారినా.. రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోవడంతో మధ్యాహ్నం 1:39 గంటలకు పరిస్థితిని అర్థం చేసుకొని ‘మేడే మేడే మేడే’ అనే సందేశాన్ని పంపించాడు పైలట్. తాజా నివేదికతో ఇంజిన్ 1, ఇంజిన్ 2కు చెందిన ఇంధన స్విచ్లు ఎందుకు కట్ అయ్యాయి.. ఎవరు కట్ చేశారు.. దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button