నరవణే బుక్ విషయంలో బిగ్ ట్విస్ట్

-
నవణే పుస్తకాన్ని ఇంకా ముద్రించలేదన్న పబ్లిషర్
-
బుక్‌ను లీక్ చేస్తే న్యాయపరమైన చర్యలకు సిద్ధమన్న పబ్లిషర్
-
నరవణే బుక్ లీక్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ఆత్మకథ బుక్ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నరవణే పుస్తకాన్ని ఇంకా ముద్రించలేదని పబ్లిషర్ కుండబద్ధలు కొట్టారు. ఈ పుస్తకాన్ని ఎవరైనా లీక్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నరవణే బుక్ లీక్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు, ఆర్మీ మాజీ చీఫ్ నరవణే బుక్ వివాదంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ స్పందించారు. పుస్తకం అందుబాటులో ఉందని నరవణే ట్వీట్ చేసినట్లు గుర్తు చేశారు. పబ్లిషర్ పెంగ్విన్… లేదంటే నరవణే… ఎవరో ఒకరు అబద్ధం ఆడుతున్నారని చెప్పుకొచ్చారు. నరవణే చేసిన ట్వీట్‌నే తాను నమ్ముతున్నారని రాహుల్ చెప్పారు.
నరవణే ఆత్మకథ పుస్తకంలోని సారాంశాన్ని రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడం రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. ఈ పుస్తకంలో చైనా-భారత్ మధ్య కొనసాగిన ఉద్రిక్తతల గురించి ప్రస్తావించినట్లు రాహుల్ చెప్పారు. ఆ సమయంలో రాజకీయ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నరవణే రాసినట్టు రాహుల్ ప్రతులను ప్రదర్శించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.









