న్యాయవాది స్వప్న హత్య కేసులో బిగ్ బిగ్ ట్విస్ట్..!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో బుధవారం (ఫిబ్రవరి 4, 2026) జరిగిన మహిళా న్యాయవాది స్వప్న (34) హత్య కేసులో ఆస్తి గొడవలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ కేసుకు సంబంధించిన తాజా వివరాలు ఇలా వున్నాయి… చేవెళ్ల కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్న స్వప్న, తన భూమిని సర్వే చేయించేందుకు పొలానికి వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. స్వప్న సొంత అన్న రాజు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఆస్తి పంపకాల్లో గొడవలు ఉండటంతో, బుధవారం ఉదయం పొలం వద్ద పంచాయతీ జరుగుతుండగా గొడవ పెద్దదై ఆమెపై కత్తితో దాడి చేసి, అనంతరం బండరాయితో కొట్టి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే రాజుతో పాటు మరో నలుగురిని (మొత్తం ఐదుగురు) అదుపులోకి తీసుకున్నారు.

తప్పించుకున్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘాతుకాన్ని నిరసిస్తూ చేవెళ్ల కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button