ఆదానీ గ్రూప్ కు భారీ షాక్‌

  • న‌కిలి ప‌త్రాలు సృష్టించి రెండుకోట్ల సిమెంట్ కాజేత‌
  • సినిమా లేవ‌ల్‌లో స్కెచ్ వేసిన నేర‌గాళ్ళు
  • ఈ సంఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపుతోంది

హైదరాబాద్, క్రైం మిర్రర్ః అదానీ గ్రూపుకు చెందిన ప్ర‌ముఖ సిమెంట్ త‌యారీ సంస్థ ఏసీసీ లిమిటెడ్‌ను టార్గెట్ చేస్తూ న‌క‌లి ప‌త్రాలు సృష్టించి 2కోట్ల విలువైన స‌మెంటును కాజేసీన సంఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపుతోంది.

ఇప్పుడు పారిశ్రామిక వ‌ర్గాల్లో వ‌ణుకు పుట్టిస్తుందనే చెప్ప‌వ‌చ్చు. వివ‌రాలోకివెళితే వైట్‌కాల‌ర్ నేరాలు రోజురోజుకు నూత‌న ఒర‌వ‌డిని అవ‌లంభిస్తున్నాయి. సామ‌న్యుల మోసం పోతున్న‌ర‌నుకుంటే ఏకంగాఅగ్ర‌శ్రేణి కార్పొరేట్ సంస్థ‌ల‌నే బురిడి కొట్టించే స్థాయికి నేర‌గాళ్ళు ఎదిగారు.లక్కీ భాస్కర్ సినిమాలో బ్యాంకింగ్‌ లొసుగులను వాడుకుని ఎలా మోసాలు పాల్పడతారో చూశాం.

సరిగా అదే తరహాలోబ్యాంక్‌ గ్యారంటీ అనే ఆయుధాన్ని వాడుకొని నిందితులు అదానీ గ్రూప్‌కు భారీ కుచ్చు టోపీ వేశారు.హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన వివరాల ప్రకారం జేపీ ఇన్‌ఫ్రా అండ్‌ ఇంజనీరింగ్ అనేసంస్థ యజమాని జ‌య‌ ప్రకాష్ ఇన్నార్తి , అతని సహచరుడు మన్మోహన్ కలిసి ఈ కుట్రకు తెరలేపారు.

వీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరుతో ఒక నకిలీ బ్యాంకు గ్యారంటీ పత్రాన్ని సృష్టించారు. ఈ పత్రం విలువ అక్షరాల 2కోట్లు. ఈ నకిలీ బ్యాంకు గ్యారంటీని అసలైనదిగా నమ్మించి, నిందితులు ఏసీసీ లిమిటెడ్‌, అంబుజా సిమెంట్స్ సంస్థలను సంప్రదించారు.

భారీ ప్రాజెక్టుల పేరుతో తమకు సిమెంట్ సరఫరా చేయాలని కోరారు. సదరు బ్యాంక్‌ గ్యారంటీ నిజమేనని నమ్మిన కంపెనీ యాజమాన్యం, నిందితులకు వివిధ విడతల్లో సిమెంట్‌ను సరఫరా చేసింది.

వివ‌రాలు…
ద‌ర్యాప్తులో భాగంగా తెలిసిన వివ‌రాల ప్ర‌కారం సరఫరా చేసిన సిమెంట్‌ విలువ రూ.2,02,05,368 రూపాయలు కాగా నిందితులు చెల్లించిన మొత్తం 5,60,000 రూపాయలు మాత్ర‌మే . మిగిలిన మొత్తం  1,96,45,368 రూపాయలు. అంటే రెండు కోట్లకుపైగా విలువైన సరకును తీసుకొని కేవలం నామమాత్రపు సొమ్మును మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.1.96 కోట్లను నిందితులు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారు.

న‌గ‌దుగా మార్చుకునేందుకు బ్యాంక్‌కు వెళ్ల‌గా షాక్‌…
నిందితుల నుంచి మిగితా బకాయిలు రాకపోవడంతో ఏసీసీ సంస్థ ఆందోళన చెంది చివరికి తమ వద్ద ఉన్న రెండు కోట్ల బ్యాంక్ గ్యారంటీని నగదుగా మార్చుకోవాలని నిర్ణయించుకొని ఏసీసీ ప్రతినిధులు పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ను సంప్రదించగ అక్కడ వారికి పెద్ద షాక్ తగిలింది.

నిందితులు సమర్పించిన ఆ బ్యాంక్ గ్యారంటీ పత్రం తమ బ్యాంక్ నుంచి జారీ కాలేదని, అది పూర్తిగా ఫోర్జరీ చేసిన నకిలీ పత్రమని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు.

పోలీసుల‌ను ఆశ్ర‌యించిన అదాని గ్రూపు ప్ర‌తినిధులు…
ఆబ్యాంక్ గ్యారంటి మా బ్యాంక్‌నుంచి జారీకాలేద‌ని తెలుప‌డంతో షాక్‌కు గురైన అదాని గ్రుప్‌ ప్ర‌తినిధులు తామునిలువునా మోసపోయామని గ్రహించిన పోలీసులను ఆశ్రయించారు. ఏసీసీ లిమిటెడ్‌ రీజినల్ సేల్స్‌ మేనేజర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు, జనవరి 24న కేసు నమోదు చేశారు. జయప్రకాష్‌ ఇన్నార్తి, మన్మోహన్‌, ఇతరులపై బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 406, 420 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button