
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీ పీ పీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే దాదాపు అన్ని మెడికల్ కాలేజీల వద్ద.. వైసిపి కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి పేర్ని నానితో పాటుగా చాలామందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని.. తన కార్యకర్తలతో కలిసి “చలో మచిలీపట్నం” మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కాలేజ్ వద్ద నిరసన చేయడానికి మా వద్ద ఎటువంటి అనుమతి తీసుకోలేదని పేర్ని నానితో పాటుగా వైసీపీ నేతలకు పోలీసులు చెప్పిన కూడా పట్టించుకోకుండా నిరసనలు చేశారు. పేర్ని నాని, కార్యకర్తలతో పాటుగా తన అనుచరులతో కలిసి అనుమతులు తీసుకోకుండా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read also : తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు.. తుఫాన్ గా మారే అవకాశం?
ఈ ఉద్రిక్త వాతావరణాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అనుమతులు తీసుకోకుండానే నిరసనలు చేయడం ఏంటని… పేర్ని నాని, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్, దేవినేని అవినాష్ వంటి ముఖ్య కార్యకర్తలతో పాటుగా… దాదాపు 400 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసులు అంతమందిపై ఒకేసారి కేసులు నమోదు చేయడంపై వైసీపీ నేతలతో పాటు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా షాకుకు గురువ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు… మెడికల్ కాలేజీల విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
Read also : ఇకపై 10 గంటలు పని చేయొచ్చు.. ఏపీ కీలక నిర్ణయం!