
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. యువత డిగ్రీ, బీటెక్ సమయంలోనే బెట్టింగ్ యాప్స్ కు బాగా అలవాటు పడ్డారు. ప్రతి సంవత్సరం ఒక భారతదేశంలోనే చాలామంది యువత సూసైడ్ చేసుకుంటున్నారు అంటే దానికి మెయిన్ కారణం ఈ బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో రకాలుగా చాలామంది కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వాడుతున్న యువకులలో వందలో పదిమంది మాత్రమే ధనికులు అవ్వగా .. మిగతా వారందరూ కూడా డబ్బులు కోల్పోయామని బాధతో… సూసైడ్ చేసుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయొద్దని… వెంటనే ఈ యాప్స్ ని బ్యాన్ చేయాలని కోరగా తాజాగా కేంద్రం బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయడం జరిగింది. అయితే చాలామంది యువత ఇంకా నిరాశలోనే ఉన్నారు.
Read also : కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ సచివాలయం ముట్టడి – అరెస్టులను ఖండించిన నేతలు
ఎందుకంటే?…. మన భారతదేశంలోని యువత చాలా మంది ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఈ యాప్స్ వారు యువత నుంచి ఎక్కువ శాతం వడ్డీ తీసుకోవడమే కాకుండా డబ్బులు సరైన కాలంలో చెల్లించకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. వడ్డీ, లోన్ రెండు సక్రమంగా చెల్లిస్తున్న కూడా ఇంకా ఎక్కువ చెల్లించాలని పర్సనల్ ఫోటోలను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపుతున్నారని చాలామంది యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ ఫోటోల వల్ల చాలామంది యువకులు సూసైడ్ చేసుకున్నారు. ఇలాంటి యాప్స్ వల్ల లాభం కన్నా ఎక్కువ ప్రమాదకరమే ఉందని అంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై నిర్ణయం తీసుకున్నట్లుగానే ఈ లోన్స్ యాప్స్ పై కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాలని చాలామంది నెటిజనులు సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో కేంద్రం ఒకసారి వీటిపై కూడా దృష్టి పెట్టాలని యువత తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు.
Read also : అప్తమిత్రుడి కుటుంబానికి ఆర్ధికసాయం