
నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు సైబర్ అవగాహన కల్పించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నల్లగొండ జిల్లా సైబర్ వారియర్స్‌కు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు చెందిన సైబర్ వారియర్ పోలీస్ కానిస్టేబుళ్లు కె. సత్యనారాయణ 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఆర్. శ్రీనివాస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లు తమ ప్రతిభకు గాను శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, బహుమతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రశంసా పత్రాలు అందుకున్న సైబర్ వారియర్ కానిస్టేబుళ్లను అభినందించారు. భవిష్యత్తులో కూడా సైబర్ నేరాల నియంత్రణలో మరింత చురుకుగా పనిచేస్తూ ప్రజలకు రక్షణ కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. సైబర్ నేరాల నియంత్రణలో నల్లగొండ జిల్లా పోలీసుల కృషికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని జిల్లా పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, సాంకేతిక చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సైదులు తదితరులు పాల్గొన్నారు.
Read also : తెలంగాణ హైకోర్టులో 859 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!
Read also : భారత్ VS కివీస్.. ఈ సిరీస్ అయినా గెలిచేనా?





