
నల్లగొండ,(క్రైమ్ మిర్రర్):-శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తూ, వృత్తిపరంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను, నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) దూది రాజును జిల్లా యంత్రాంగం అభినందించింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో, ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు ఈ గౌరవం దక్కింది. జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ల చేతుల మీదుగా సీఐ దూది రాజు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. నాంపల్లి సర్కిల్ పరిధిలో లా అండ్ఆర్డర్‌ను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ, అంకితభావంతో విధులను నిర్వర్తించడం, తన పరిధిలోని నేరాలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ గౌరవం దక్కింది.. ఈ సందర్భంగా సీఐ దూది రాజు మాట్లాడుతూ.. తన విధి నిర్వహణను గుర్తించి, ఈ పురస్కారాన్ని అందించినందుకు గాను జిల్లా ఉన్నతాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. సీఐ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు తోటి అధికారులు, సిబ్బంది, స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు అభినందనలు తెలిపారు.
Read also : భక్తులతో కిటికీటలాడుతున్న మేడారం.. ఈ కొన్ని విషయాలలో జాగ్రత్త!
Read also : ఏంటి అభి భాయ్.. 12 బంతుల్లోనే 50 చేయాల్సింది : యువరాజ్ సింగ్





