
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్, ప్రముఖ యాంకర్ శివ జ్యోతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. తిరుమల దర్శనం చేసుకున్న శివ జ్యోతి అనంతరం స్వామి వారి ప్రసాదం తీసుకుంటున్న సందర్భంలో శివజ్యోతి తో పాటు మరో వ్యక్తి వచ్చి ప్రసాదం తీసుకుంటుండగా.. “అడుక్కుంటున్నాడు” అని.. ఇతను తిరుపతిలోనే రిచెస్ట్ బిచ్చగాడు అంటూ ఆమె అపహాస్యం చేస్తు వీడియో తీసుకున్నారు. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆమెపై తీవ్రంగా మండి పడుతున్నారు. తిరుమల ప్రసాదాన్ని అడగడాన్ని కూడా అడుక్కుంటున్నాడు అని బిచ్చగాడిని చేస్తావా అంటూ భక్తులందరూ ఆమెపై విమర్శలకు. వివిధ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి నీకు బాగా అహంకారం వచ్చింది అంటూ భక్తులు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమలలో ప్రసాదాన్ని అడగడాన్ని కూడా ఇలా తప్పు ద్రోవలో అవమానించడం సరికాదు అని.. వెంటనే ఈమెపై తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వారికి ఒకసారి జైలు శిక్ష విధిస్తే కానీ దారిలోకి రారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : Cockroach Coffee (VIDEO): చచ్చిన బొద్దింకలతో కాఫీ! ధరెంతో తెలుసా..?
Read also : త్వరలో ఏపీ లోనూ సర్పంచ్ ఎన్నికల సన్నహాలు!





