తెలంగాణ

హైదరాబాద్‌లో బీచ్‌ – 35 ఎకరాల్లో ఏర్పాటు..!

Hyderabad beach : బీచ్ అంటే ఎవరికి ఇష్టముండదు. సముద్రపు అందాలను చూస్తూ… అలల సవ్వడి వింటూ.. నీటిలో ఆడుకుండా.. హ్యాపీగా గడపాలని చాలా మందికి ఉంటుంది. అందుకే.. వీకెండ్లలో… సెలవు రోజుల్లో బీచ్‌ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. తెలంగాణ ప్రజలకు… ఆ సౌకర్యం లేదు. సముద్రాన్ని చూడాలంటే.. ఏపీకో లేదా చైనా, గోవా… గోకర్ణ ఇలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌ దగ్గర కనుక… వీకెండ్‌లో అక్కడి బీచ్‌లకు వెళ్తుంటారు హైదరాబాద్‌ వాసులు. అదే హైదరాబాద్‌లో ఒక బీచ్‌ ఉంటే..? ఇకేముంది.. ఆ సందడే వేరు. తెలంగాణ ప్రజలకు సముద్రం లేదనే కొరత తీర్చేందుకు… సరికొత్త నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్‌ బీచ్‌ సిద్ధం చేయబోతోంది. అందుకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేసింది.

హైదరాబాద్‌ శివారులోని కొత్వాల్‌గూడ దగ్గర కృత్రిమ బీచ్‌ సిద్ధం కాబోతోంది. 35 ఎకరాల్లో బీచ్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 225 కోట్ల రూపాయల పెట్టుబడితో… బీచ్‌ను నిర్మించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్‌లో ఈ పనులు ప్రారంభమవుతాయి. అచ్చంగా సముద్రంలా అనిపించేలా… అలలు కూడా వచ్చేలా… ఈ బీచ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి కృత్రిమ బీచ్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా త్వరంలోనే ఈ బీచ్‌ అందుబాటులోకి రాబోతోంది. దీని వల్ల… అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించాలన్నదే ప్రభుత్వ ఆలోచన.

ఈ కృత్రిమ బీచ్‌ అందుబాటులోకి వస్తే.. తెలంగాణకు సముద్రం లేదనే ఫీలింగ్‌ ప్రజల్లో ఇక ఉండదు. హైదరాబాద్‌ వాసులు.. హ్యాపీలో వీకెండ్లలో పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా… బీచ్‌ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ కృత్రిమ బీచ్‌ను ప్రైవేట్‌, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించబోతున్నారు. అతిపెద్ద కృత్రిమ సరస్సును నిర్మించి.. దాని చుట్టూ బీచ్‌ను అభివృద్ధి చేస్తారు. కేవలం ఇసుకతో కూడిన సముద్రతీరంలా కాకుండా… ఎన్నో రకాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. వాటర్‌ గేమ్స్‌తోపాటు ఫ్లోటింగ్‌ విల్లాస్‌, వేవ్‌ పూల్స్‌ కూడా నిర్మించబోతున్నారు. ప్లాన్‌ పెద్దదే.. కానీ పూర్తిచేయడమే ఒక పెద్ద టాస్క్‌. అయితే.. తెలంగాణ ప్రభుత్వం.. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేయాలని భావిస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ముందు వస్తున్నందు వల్ల… త్వరగానే పూర్తిచేయాలని భావిస్తుంది. ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది.. హైదరాబాద్‌కు బీచ్‌ వస్తే.. ఆహా.. ఆ ఊహే అద్భుతం కదా.. ఇక వీకెండ్‌ వస్తే.. నగర వాసులందా ఆ బీచ్‌ దగ్గరే ఉంటారేమో…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button