
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాలను నమ్మి సైబర్ ప్రమాదాలకు గురి కాకూడదని యుడబ్ల్యూఎం యువత సొసైటీ సభ్యురాలు ఉషారాణి అన్నారు. శనివారం మలక్పేట్ లోని డాన్ హై స్కూల్ లో జరిగిన సైబర్ సేఫ్టీ అండ్ డిజిటల్ లిట్రిసి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల్లో అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ విషయమై సంబంధిత సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని ఆమె పేర్కొన్నారు. దీంతోపాటు తల్లిదండ్రులు, పెద్దలు, టీచర్లకు తెలియపరచాలని ఆమె సూచించారు.
డీలిమిటేషన్‌పై కేంద్రంతో స్టాలిన్ పోరాటం – ఏపీ, తెలంగాణ కలిసివస్తాయా…?
మొబైల్ ఫోన్లలో మెసేజిల రూపంలో లేదా వాట్సాప్ లలో వచ్చే మోసపూరితమైన సమాచారాన్ని నమ్మి నష్టపోకూడదని ఆమె సలహా ఇచ్చారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లేదా ఎవరినైనా కిడ్నాప్ చేసినట్లు తప్పుడు సమాచారాలను అందించే ఫేక్ వ్యక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని, అలాగే చిన్నారులకు అవసరమైన మేరకు ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంచాలని ఆమె తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియా ల ద్వారా తమ వ్యక్తిగత వివరాలను ఎలా గోప్యంగా ఉంచుకోవాలో ఆమె ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనవసరమైన సామాజిక లింకులను క్లిక్ చేయకూడదని ఆమె హితబోధ చేశారు. సైబర్ ప్రమాదానికి గురైన వెంటనే 1930 కు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డాన్ విద్యాసంస్థల చైర్మన్ ఫజల్ ఉర్ రెహమాన్ ఖుర్రం, శజీవుల్లా ఫిరాసత్, విద్యార్థిని, విద్యార్థులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు సాక్షుల మరణాల్లో మిస్టరీ – పరిటాల కేసులోనూ ఇంతే..!