
క్రైమ్ మిర్రర్ ఆన్లైన్ డెస్క్ :- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో… తెల్లవారుజామున 2గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్-ICUలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. నిరంతరం వైద్యసాయం అందిస్తున్నామని చెప్పారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలిసి.. బీజేపీ నేతలు, దేశ ప్రజలు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఫ్రాడ్ మెసేజెస్ పై తప్పకుండా ఫిర్యాదు చేయండి..
ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌ని పరామర్శించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లారు. ధన్కడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రలు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.జగదీప్ ధన్కడ్ 2021 నుంచి భారత ఉపరాష్ట్రపతిగా సేవలు అందిస్తున్నారు. గతంలో ఆయన పశ్చిమ బెంగాల్ గర్నవర్‌గా పనిచేశారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు కూడా వచ్చారు ధన్కడ్. సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటీ క్యాంపస్‌ను సందర్శించారు. విద్యార్థులతో కూడా ముఖాముఖి నిర్వహించారు.
వైఎస్ వివేకా హత్య కేసు సాక్షుల మరణాల్లో మిస్టరీ – పరిటాల కేసులోనూ ఇంతే..!