
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వృధా చేసుకోవాలనుకోవడం లేదు. అందిన ప్రతి అవకాశాన్ని కూడా క్యాష్ గా మార్చుకునేందుకు రెడీగా ఉన్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి లింక్స్ మరియు ఏపీకేలు లాంటివి కాకుండా క్యూఆర్ కోడ్ ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పోలీసులు సూచనలు చేశారు. ఇప్పటికే ఈ సైబర్ నేరాల నియంత్రణ పట్ల ఐటి విభాగం పోలీసులు సర్వశక్తుల నేరాల నియంత్రణకై పనిచేస్తున్నారు అని తెలిపారు. సైబర్ నేరాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృత స్థాయిలో ప్రచారాలు కూడా చేస్తున్నారు.
Read also : PM Modi: మీ కంటే అసదుద్దీన్ బెస్ట్, తెలంగాణ బీజేపీ నేతలపై మోడీ ఆగ్రహం
నిన్న, మొన్నటి వరకు తెలియని లింకులు మరియు ఏపీకే ఫైల్స్ లాంటి వాటితో మోసాలకు పాల్పడిన సైబర్ నేర గాళ్ళు తాజాగా క్యూఆర్ కోడ్ ల రూపంలో కూడా మోసాలకు పాల్పడుతున్నారు అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు అప్రమత్తంగా లేకుంటే కచ్చితంగా సైబర్ నేరానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మీకు తెలిసిన వారు కాకుండా ఎవరైనా ఇతర వ్యక్తులు ఏవైనా లింకులు మరియు QR కోడ్లు వంటివి పంపిస్తే ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు కాల్ చేసి చెక్ చేసుకోవాలి అని కోరారు. కాబట్టి మొదటగా మీరు అప్రమత్తంగా ఉంటేనే మోసాలకు గురి కాకుండా ఉంటారు అని చెబుతున్నారు. ఎవరైనా సరే సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also : మార్పు కోరిన ప్రజలు.. పాలకూరి రమాదేవి,నరసింహ గౌడ్ ఘన విజయం





