
క్రైమ్ మిర్రర్, వలిగొండ:- వలిగొండ మండల పరిధిలోని ప్రజలు భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు బయటకు రాకూడదని ఎస్ఐ యుగంధర్ గౌడ్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శిథిలవైన భవనాల్లో ఉండవద్దని విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు స్తంభాలను తాకవద్దని ప్రజలకు రైతులకు సూచించారు వర్షాల ప్రభావంతో చెరువులు కుంటలు లోతాట్టు ప్రాంతాలు జరమయమయ్యే అవకాశం ఉన్నందున చిన్నారులను వృద్ధులను ఒంటరిగా బయటకు పంపించవద్దు అని అన్నారు. వర్షాలతో చెరువులు కుంటలు నిండి ప్రవహిస్తున్నందున ప్రజలందరూ పోలీసువారి సూచనలతో తమ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.వర్షపు రోడ్లపై వేగంగా డ్రైవ్ చేయవద్దు అని అత్యవసర సందర్భాల్లో 100/112 కి కాల్ చేయాలని ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపారు.
Read also : షాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు..!
Read also : ఎడతెరిపిలేని భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలి : ఎస్ఐ జగన్





