తెలంగాణ

బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక : తహసిల్దార్ వీరాభాయ్

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:- బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని చౌటుప్పల్ తహసిల్దార్ వీరాభాయ్ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న ప్రతిభ ఒకేషనల్, శ్రీ మేధ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరాభాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు ఘనంగా జరుపుకుంటారని అన్నారు. తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు పూలతో గౌరీదేవిని పూజిస్తారని, మహాలయ అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మగా ముగుస్తుందని తెలిపారు. విద్యార్థినిలు, మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రధారణతో, పూలతో అలంకరించుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల బతుకమ్మలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆదరించే ఆచారానికి ప్రతీక అని పేర్కొన్నారు. చెడు పై విజయం సాధించిన పండుగ విజయదశమి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిలివేరు ధనలక్ష్మీ, ప్రిన్సిపల్ లు సిలివేరు శ్రీనివాస్, లింగారెడ్డి, అధ్యాపకులు బాలకృష్ణ, రాజేష్, లింగస్వామి, నవ్య, రజిత, పి జ్యోతి, భాగ్యలక్ష్మి, ఎల్ జ్యోతి, ప్రత్యూష, రాజశేఖర్ రెడ్డి, జంగారెడ్డి, బొడ్డుపల్లి రాజు, రాణి తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

ముందస్తు చర్యలు లేకపోవడం కారణంగానే నేడు ఈ దుస్థితి : హరీష్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button