
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న వాతావరణం ఇప్పుడు బంగ్లాదేశ్ తో కూడా నెలకొనే అవకాశం ఉంది. తాజాగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వైరాలు ప్రతిరోజు కూడా ముదురుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడుల పట్ల యావత్ భారత దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగ స్పందిస్తూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజర్ను ఐపీఎల్ నుంచి తొలగించాలని డిమాండ్లు చేయగా బీసీసీఐ తాజాగా కోల్కత్తా జట్టు నుంచి ముస్తాఫిజర్ను తీసివేయించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది అని చెప్పవచ్చు. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశంలో ఐపిఎల్ ప్రసారం పై నిషేధం ఉంటుంది అని ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ ఆదేశాలను ఉల్లంఘించవద్దు అని.. బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారం బ్యాన్ చేయాలి అని బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. మరోవైపు టి20 వరల్డ్ కప్ కోసం భారతదేశానికి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రాదు అని ఐసీసీకి కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేక రాసింది.
Read also : ‘అమెజాన్ పే’లో మరో కొత్త సేవలు
ఈ నేపథ్యంలోనే తాజాగా ఐపీఎల్ ప్రసారంపై కూడా బ్యాన్ విధించడంతో.. భారతదేశానికి ఇప్పుడు రెండు దేశాలు వైరంగా మారాయి. మొన్నటివరకు ఐపీఎల్ కు పాకిస్తాన్ దేశాన్ని బ్యాన్ చేయగా ఇప్పుడు బంగ్లాదేశ్ దేశాన్ని కూడా బ్యాన్ చేసే దిశగా కసరత్తులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మీరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. కానీ భారతదేశ క్రికెట్ అభిమానులు మాత్రం బంగ్లాదేశ్ ఐపీఎల్ ప్రసారం బ్యాన్ చేసినంతమాత్రాన ఒరిగేది ఏమీ లేదు అని.. అది బంగ్లాదేశ్ కే నష్టం కానీ భారత్ కు ఎలాంటి నష్టం ఉండదు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ దేశం లా ఆ దేశ క్రికెటర్లను ఐపీఎల్ కు బ్యాన్ చేయాలి అని చెప్పి బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య వైరాలు ఇలానే ముదురుతూ పోతే ఖచ్చితంగా ఆ నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Read also : Murder Case: మహిళ దారుణ హత్య, హంతకుడిని పట్టించిన ఆమ్లెట్!





