
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- కిరణ్ అబ్బవరం తాజాగా నటించినటువంటి K-RAMP అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్లడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా అతిథిగా బండ్ల గణేష్ రావడం.. అతను చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడం 2 చక చక జరిగిపోయాయి . సాధారణంగా ఇప్పటి కాలంలో ఎవరైతే హీరోలు ఉన్నారో వారు అందరూ కూడా ఒకటి లేదా రెండు సినిమాలలో హిట్ కానీ బ్లాక్ బస్టర్ కానీ అందుకుంటే లూస్ ప్యాంట్లు వేయడం, చింపిరి జుట్టు చేయించుకోవడం, ప్రతి ఒకరి దగ్గర ఫోజులు కొట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ కిరణ్ అబ్బవరం ఇప్పటికీ కూడా చాలా సింపుల్ గా కనిపిస్తూ ప్రతి ఒక్కరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు అని అన్నారు. అంతటితో ఆగకుండా కిరణ్ అబ్బవరం లో నాకు చిరంజీవి కనిపిస్తున్నారు అంటూ సక్సెస్ మీట్ లో భాగంగా యంగ్ హీరో అయినటువంటి కిరణ్ అబ్బవరాన్ని నిర్మాత బండ్ల గణేష్ ఆకాశానికి ఎత్తేశారు. ప్రతి నిమిషానికి ఒక డైలాగ్ చెబుతూనే ఈ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ హైలెట్ అయ్యాడు. ఒక రెండు సినిమాలు మంచి హిట్ అవ్వగానే నేను రాజమౌళితో సినిమా తీయాలి లేదా లోకేష్ కనగరాజు తో సినిమా తీయాలి అనే కలలుకనే హీరోలు ఉన్నటువంటి ఈ కాలంలో కిరణ్ అబ్బవరం మాత్రం ఇప్పటికే ఆరు సినిమాలకు పైగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చి చాలామందికి పూట గడిచేలా చేశారు అని ప్రశంసించాడు. కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడమనేది సాధారణ విషయం కాదు.. అలాంటిది ఈ యువ హీరో కొత్త డైరెక్టర్లతో సినిమాలు తీస్తూ.. అవి కూడా హిట్ కొడుతూ ముందుకు వెళ్లడం అనేది మెచ్చుకోవాల్సిన విషయమే అని చెప్పారు. ఇలానే ఎంత ఎదిగినా కూడా.. అంత ఒదిగి ఉండాలి అని కిరణ్ అబ్బవరం తో పాటుగా కొంతమంది యువ హీరోలకు బండ్ల గణేష్ సూచించారు.
Read also : స్మోకింగ్, ఆల్కహాల్ కంటే డేంజరస్ అలవాటు ఏంటో మీకు తెలుసా?
Read also : తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు!.. IMD కీలక ప్రకటన





