మున్సిపల్ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

క్రైమ్ మిర్రర్,నిర్మల్:- మున్సిపల్ ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్ల ముద్రణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం స్థానిక ఆదర్శనగర్‌లోని విజయ్ ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రణ ప్రక్రియను ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అవసరమైనన్ని బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయడం, లోపాలు లేకుండా ముద్రణ నిర్వహించడం, పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించడం వంటి అంశాలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, నోడల్ అధికారులు రమణ, శంకర్, జగదీశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Read also : హెచ్ఐవి డేంజ‌ర్ బెల్స్‌

Read also : రూ.32 ల‌క్ష‌లు సొంతానికి వాడుకున్న వైనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button