తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన లగచెర్ల ఘటన కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది. నిందితులు అందరికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి కు 50 వేల రూపాయలు, రెండు ష్యూరిటీలు , మిగతా వారు 20 వేల రూపాయలు, రెండు షూరిటిలు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మూడు నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ముందు విచారణ హాజరుకావాలని పట్నం నరేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.
Read More : ఉగాండాలో డింగా… డింగా మహమ్మారి!.. 300కు పైగా కేసులు?
లగచెర్ల ఘటనలో మొత్తం 26 మంది సంగారెడ్డి జైలులో ఉండగా 24మందికి బెయిల్ వచ్చిందని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ చెప్పారు. పిడిపిపి కోర్టులో బెయిల్ మంజూరైందని.. 3నెలల వరకు పోలీసులు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించిందని తెలిపారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సురేష్ కు ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. సురేష్ బెయిల్ పై బుధవారం వాదనలు కొనసాగనున్నాయి.