
-
కూటమి సర్కార్‌పై వైసీపీ నేత బొత్స ఫైర్
-
సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏమయ్యాయయని ప్రశ్న
-
ప్రశ్నించినవారి మక్కెలు విరగ్గొడతారా?
-
క్షేత్రస్థాయికి వెళ్తే ఎవరి మక్కెలు విరుగుతాయో తెలుస్తుంది
క్రైమ్ మిర్రర్, అమరావతి: ఏపీలో కూటమి సర్కార్‌పై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి ఫైరయ్యారు. సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకిచ్చారు? ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని బొత్స ప్రశ్నించారు. ఇదేంటని అడిగినవారి మక్కెలు విరగ్గొడతాం, తాటతీస్తామని హెచ్చరించడం ఎంతవరకు సమంజసమన్నారు. కూటమి నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే… ఎవరి మక్కెలు ఎవరు విరగ్గొడతారో తెలుస్తుందని బొత్స హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా… మహిళలు, రైతులు మోసపోతారని గుర్తు చేశారు బొత్స. మాయమాటలు చెప్పేవాళ్లను మోసగాళ్లు అనాలా? వద్దా? అని బొత్స ప్రశ్నించారు.
రాష్ట్రంలో టీడీపీ అరాచకం సృష్టిస్తుంది.. పవన్ గుర్తుంచుకో : పేర్ని నాని
కాకినాడ పిఠాపురంలో వంగా గీత అధ్యక్షతన జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. చంద్రబాబు వంద అబద్ధాలు ఆడితే… దానికి రెట్టింపు అబద్ధాలు లోకేష్ ఆడుతున్నారని గుర్తు చేశారు. మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా లోకేష్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ పేరుతో వైసీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని బొత్స పిలుపునిచ్చారు.