
క్రైమర్ మిర్రర్, సినిమా న్యూస్:- దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ మరియు రాణా కీలకపాత్రలో పోషించినటువంటి బాహుబలి, బాహుబలి 2 రెండు సినిమాలను కలిపి “బాహుబలి ది ఎపిక్” గా సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు బాహుబలిని అలాగే బాహుబలి 2 ను ఎంతగా ఆదరించారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు సినిమాలకు కలిపి దాదాపు ₹2,000 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా విడుదలైన రోజునే ప్రపంచవ్యాప్తంగా ఒక చరిత్రనే సృష్టించింది. ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమే మారిపోయింది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. తెలుగు సినిమాలకు ఒక పాన్ ఇండియా మార్కెట్ ను పరిచయం చేయడం ఈ సినిమా వల్లనే సాధ్యమైంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హీరోలు అలాగే డైరెక్టర్లు అందరూ కూడా మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూశారు. అలాంటి బాహుబలి ది ఎపిక్ సినిమా ఈరోజు అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఈరోజు అర్ధరాత్రి నుంచి ఓటీటీ లోకి రానుంది. కాగా ఈ మూవీ డ్యూరేషన్ 3:48 గంటలు ఉంది. ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ప్రభాస్ అభిమానులు ఈరోజు నుంచి ఈ సినిమాను ఓటీటీ లో చూడవచ్చు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





