
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినటువంటి అజారుద్దీన్ తనపై కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ కౌంటర్లు వేశారు. దేశద్రోహానికి పాల్పడి, దేశానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు?.. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విషయంపై అజహారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కౌంటర్స్ వేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. దేశభక్తిపై ఎవరూ నాకు ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. నాపై ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు.. కానీ అవన్నీ పట్టించుకుంటూ కూర్చోలేను అని చెప్పుకొచ్చారు. నన్ను క్యాబినెట్ లో తీసుకోవడం హై కమాండ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చేతిలో ఉంటుంది కానీ.. నా చేతిలో ఏమి ఉండదని అన్నారు. మరోవైపు నా మంత్రి పదవికి అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం కూడా లేదు అని తేల్చి చెప్పారు.
Read also : సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు?
Read also : రన్ ఫర్ యూనిటీ… ఐక్యమత్యమే మహాబలం
 
				 
					
 
						 
						




