
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరం తాజాగా మరో కొత్త రికార్డు సృష్టించింది. అయోధ్యంలో రామ మందిరం నిర్మాణం 2022వ సంవత్సరంలో జరగగా ఇప్పటివరకు ఈ అయోధ్య రామ మందిరానికి దాదాపు 3 వేల కోట్లకు పైగా విరాళాలు అందాయని ఆలయ అధికారులు వెల్లడించారు. విరాళాలు అందిన 3 వేల కోట్లలో దాదాపు 1500 కోట్లను అయోధ్య నిర్మాణం కోసమే ఖర్చు చేసినట్లు రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ అయినటువంటి నృపేంద్ర మిశ్రా తాజాగా వెల్లడించారు.కాగా వచ్చేనెల 25 అనగా నవంబర్ 25వ తేదీన అయోధ్య రామ మందిరంలో జరిగేటువంటి జెండా ఆవిష్కరణ వేడుకకు స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరు అవుతారు అని ప్రకటించారు.
Read also : తెలంగాణలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి తో పాటుగా మరో 8,000 మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించునున్నట్లుగా రామ్ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ వెల్లడించారు. కాగా ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది ప్రజల బలిదానాలు తరువాత ఎట్టకేలకు 2022లో అయోధ్య రామ మందిరం అయితే పూర్తయింది. అయోధ్యలో రామ మందిరం నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని కోట్లలో ప్రజలు దర్శనం చేసుకుంటున్నారు. అయోధ్య మందిర నిర్మాణం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవించారు. ఏది ఏమైనా కూడా అయోధ్య రామ మందిరం మనదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయంగా కొద్ది రోజుల్లోనే అవతరించింది. దేశ విదేశాల నుంచి ఈ రామ మందిరంలోని రాముడిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అలాంటి రామ మందిరం అయినటువంటి అయోధ్య విరాళాలలోనూ రికార్డ్స్ సృష్టిస్తుంది.
Read also : తుఫాన్ ఎఫెక్ట్ తగ్గిందని ఆనందపడుతున్నారా..? ఆరోగ్య విషయంలో జాగ్రత్త!





