
తిరుపతి, క్రైమ్ మిర్రర్ :- తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భక్తుడిపై జరిగిన దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టుకు వెళ్లే ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ చెప్పిన అధిక చార్జీని భక్తుడు నిరాకరించడంతో, డ్రైవర్‌తో పాటు అతడి సహచరులు భక్తుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది మూకుమ్మడి దాడిగా మారి, చూసిన వారిని షాక్‌కు గురి చేసింది.
Read also :- ట్రంప్ చర్యలతో ఆర్థిక విధ్వంసం, అమెరికన్ ఆర్థికవేత్తల ఆగ్రహం !
తిరుపతిలో గతంలో కూడా ఆటో డ్రైవర్లు భక్తులను వేధించిన ఘటనలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆందోళన రేపుతోంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులను తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.భక్తుల భద్రతకు, యాత్రానగర ప్రతిష్టకు భంగం కలిగించే ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని సామాజిక వర్గాలు చెబుతున్నాయి.
Read also: కోస్తాలో భారీ వర్షాలు.. ఎన్ని రోజులు అంటే?