
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్టోబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో 3 వన్డేల సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభం కాకముందే ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ అయినటువంటి కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్ మొత్తానికి దూరమయ్యారని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ తెలిపింది. ఇక కామెరాన్ గ్రీన్ ప్లేస్ లో మార్నస్ లభిషేన్ ను ఎంపిక చేశారు అని సమాచారం. ఈ న్యూస్ టీమిండియా కు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అక్టోబర్ 19 జరగబోయేటువంటి మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాలోని పెర్త్ సిటీలో జరుగునుంది. ఈ పెర్త్ మైదానంలో బౌన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇండియన్ ప్లేయర్లకు సవాల్ గా మారుతుంది అని క్రికెట్ విశ్లేషకులు చర్చిస్తున్నారు. మరోవైపు టీమిండియాలోకి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ లాంటి కీళ్లకు ప్లేయర్లు మళ్ళీ చాలా రోజుల తర్వాత అడుగు పెడుతున్నారు. ఆస్ట్రేలియాపై వీరిద్దరికి మంచి రికార్డులు ఉండడంతో కచ్చితంగా బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆస్ట్రేలియా సిరీస్ వీళ్ళిద్దరికీ కూడా కీలకంగా మారింది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సిరీస్ లో బాగా రాణిస్తేనే వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకోగలరు.
Read also : ఋతుపవనాల ఎఫెక్ట్… ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
Read also : ఆ పని చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి : బీఆర్ఎస్ సీనియర్ నేత