
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య రేపు వన్డే సిరీస్ మొదలవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే భారత జట్టు ఆటగాళ్లు అందరూ కూడా ఆస్ట్రేలియా చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ వన్డే సిరీస్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీకి చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయేటువంటి ఓడి సిరీస్ కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపుగా చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టారు. అది కూడా బలమైన ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాపై తలపడుతుండడంతో వీళ్ళ ఇద్దరి బ్యాటింగ్ చూడడానికి చాలా ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరగబోయేటువంటి ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫ్యాన్స్ కూడా టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే అనుకోకుండా ఆస్ట్రేలియాలోని ఆక్యు వెదర్ రిపోర్ట్ ప్రకారం రేపు జరగబోయేటువంటి మ్యాచ్ సమయంలో పలుమార్లు వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని.. దీని ద్వారా మ్యాచ్ అంతరాయం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది అని వెల్లడించారు. ఈ వర్షం వల్ల టాస్ కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. కాగా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 35% వరకు పెరగవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఒకవేళ వాతావరణ శాఖ అధికారులు తెలిపినట్లుగా వర్షం పడితే మాత్రం మ్యాచ్ అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఒక ఇంత నిరాశ చెందాల్సి వస్తుంది.
Read also : సదర్ సందడి 2025… యాదవ సోదరుల ఉత్సాహం
Read also : పాక్‌లోకి ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే: రాజ్‌నాథ్