Thursday, March 19, 2026
Homeఆంధ్ర ప్రదేశ్అంబటి ఇంటిపై దాడులు.. హైకోర్టు కీలక ఆదేశాలు

అంబటి ఇంటిపై దాడులు.. హైకోర్టు కీలక ఆదేశాలు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై కూటమి నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అసభ్యకర పదజాలంతో దూషించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మండటంతో వెంటనే అంబటి రాంబాబు ఇంటిని అలాగే ఇంటిలో ఉన్నటువంటి సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ హైకోర్టు హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబటి రాంబాబు ఇంటి వద్ద అలాగే అతని కుటుంబానికి 24 గంటలపాటు పూర్తి భద్రత కల్పించాలి అని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పూర్తిగా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాల్సిందిగా ఆదేశించింది. అంబటి రాంబాబు భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపిన అనంతరం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా కూడా ఈ విచారణ అనంతరం అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం చాలా సీరియస్ గా స్పందించింది.

Read also : ఆంధ్రాలో అగ్గిరాజుకుంటున్న రాజకీయాలు, నాయకుల ఇళ్లపై దాడులు.. ప్రస్తుత పరిస్థితి ఏంటి?

Read also : పాకిస్తాన్ ను చిత్తు చేసి సెమీస్ లోకి అడుగుపెట్టిన భారత అండర్-19 జట్టు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments