
చండూరు, క్రైమ్ మిర్రర్:- నల్గొండ జిల్లా, చండూరులో మంగళవారం రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులపై దాడి జరిగిందని సమాచారం. ఇటీవల దొంగతనాలు జరుగుతున్న క్రమంలో రాత్రివేళ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. మంగళవారం సుమారు అర్థరాత్రి సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు కస్తా ల మార్గంలోని ఓ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లగా అక్కడ ముగ్గురు యువకులు మద్యం తాగుతూ కనబడ్డారు. అక్కడి నుండి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపినప్పటికీ యువకులు ర్యాష్ గా ప్రవర్తించడమే కాకుండా ఒక కానిస్టేబుల్ పై దాడి చేసి గాయపరిచినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినట్లు సమాచారం. ప్రజలకు కష్టం వస్తే పోలీసులకు చెప్పుకుంటారు. అదే పోలీసుల పైన దాడి జరిగితే పరిస్థితి ఏంటి?…. పోలీసులపై దాడి జరిగిన విషయం బయటికి రాకుండా కొందరు తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలిసింది మామూలుగా గొడవలకు దిగే వారినే పోలీసులు వదలరు మరి పోలీసుల పైన దాడి చేసిన వారిని ఏం చేస్తారో వేచి చూడాలి. వారిని కఠినంగా శిక్షిస్తారా? లేక మామూలు సెక్షన్లు పెట్టి వదిలేస్తారా అనేది స్థానికంగా చర్చ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అఫీషియల్ గా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Read also : కీలక పదవుల్లో ఉన్న నాయకులు.. ఇలానా మాట్లాడేది : నెటిజన్లు ఆగ్రహం
Read also : ముగ్గురు కూతుర్ల తండ్రికి 21 లక్షల పరిహారం..! మరి ఆ లోటు ఎవరు తీర్చును?





