
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
పాకిస్తాన్ చేసినటువంటి వైమానిక దాడులలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ముగ్గురు, మరో ఐదు మంది సామాన్య ప్రజలు మృతి చెందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారగా పాకిస్తాన్ దేశంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ముగ్గురు క్రికెటర్లకు నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అయితే పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడిపై తాజాగా ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాసాలపై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడిని ఖండిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఈ అనగారిక, ఆటవిక చర్యలో మహిళలు , పిల్లలు, దేశానికే ప్రాతినిధ్యం వహించాల్సిన యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంగనే అవుతుంది అని తెలిపారు. త్వరలో పాకిస్తాన్ తో జరగబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలగాలని క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను అంటూ రషీద్ ఖాన్ అన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో నా ప్రజల పక్షాన నిలబడతానంటూ సోషల్ మీడియా వేదికగా రషీద్ ఖాన్ ట్వీట్ చేశారు. కాగా ఈరోజు పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో ఆఫ్ఘనిస్తాన్ ముగ్గురు యువ క్రికెటర్లు, మరో ఐదు మందితో పాటు మొత్తంగా 8 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆహ్వానిస్తాన్ దేశాన్ని కలచివేసింది.
Read also : పాక్‌లోకి ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే: రాజ్‌నాథ్
Read also : తిరుమలలో దళారుల బెడదపై టీటీడీ చైర్మన్ ఆందోళన