హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి జరిగింది. వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతుంది. వారం క్రితం ఎయిర్ పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాలపై దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ దాడి మరవకముందే రెండు రోజుల క్రితం సిద్దాంతికట్ట మైసమ్మ త్రూశూలం ద్వంసం చేశారు. తాజాగా శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామం పోచమ్మ దేవాలయంలోని పోచమ్మ తల్లి కను గుడ్లను తొలగించి విగ్రహం వస్త్రాలను తీసి ఆలయం ముందు వేశారు దుండగులు. గమనించిన స్థానికులు ఆలయానికి వస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. అయితే ఓ అనుమనితున్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
పోచమ్మ ఆలయానికి చేరుకున్న పోలీసులు అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి వస్త్రాలు తీస్తున్నప్పుడు దాదాపు పదిమంది నిందితులు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తాము రావడం చూసి మిగతా తొమ్మిది మంది అక్కడి నుండి పరారీ అయ్యారని అంటున్నారు.
దేవాలయాలపై రోజుకు ఏదో ఒకచోట దాడులు జరగడంపై హిందూ సంఘాలు పోలీసులపై భగ్గుమంటున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నిస్తున్నాయి.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవుతున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే ఏ ఒక్క హిందూ దేవాలయం మిగలదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డిసిపి రాజేష్. ఎసిపి శ్రీనివాస్ పరిశీలించారు. గుడి వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు
మరిన్ని వార్తలు చదవండి ..
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి
టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్
20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ