
క్రైమ్ మిర్రర్, ముంబై:- దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే లైంగిక హింసను కలవరపెడుతున్న సందర్భంలో మరో దారుణం చోటుచేసుకుంది. ముంబైలో మతిస్థిమితం లేని 18 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం 8 నెలల గర్భిణీగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు, దాంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది.ఈ అమానవీయ ఘటన గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలికి అప్పటినుండే మానసిక స్థితిలో అసమర్థత ఉండడంతో ఆమె వేదన బయటపెట్టలేకపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read also : ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి…? ఆ 10మందిపై వేటు తప్పదా..?
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మూడవ నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. బాధితురాలి వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ చేపట్టారు. ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మానసికంగా బలహీన స్థితిలో ఉన్న అమ్మాయిపై జరిగిన ఈ అమానవీయ చర్య ముంబై నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read also : మంత్రి పదవి కోసం కలలు కంటున్న రాజు గారు – కల తీరేనా..? చెదిరేనా..?