తాడేపల్లిగూడెం పట్టణంలో దారుణం

  • ప్రియురాలిపై దాడి
  • చికిత్సపొందుతూ మృతి
  • కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న

తాడేపల్లిగూడెం,క్రైం మిర్ర‌ర్ః

తాడేప‌ల్లి గూడెం ప‌ట్ట‌ణంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి సురేష్ కుటుంబ స‌భ్యులు ప్రియురాలు త‌మ్మిరె డ్డి వసంత‌ను దాడి చేసి చంపేసిన ఘ‌ట‌న ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.

కైకలూరులోకుముడి గరువు గ్రామానికి చెందిన వ‌సంత‌, తేడెప‌ల్లి గూడెంకు చెందిన బండారు సురేష్‌లు ఇద్ద‌రు ప్రేమించుకున్నారు. వీరు విజ‌య‌వాడ‌లో ఒక ప్రైవేటు యూనివ‌ర్సిటిలో వ‌సంత‌, సురేశ్ బీటెక్‌ చ‌దువుకున్నారు.

ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు ప్రేమించుకున్నారు. ప్రేమించిన సురేశ్‌కు వ‌సంత రూ.ల‌క్ష న‌గదు ఇచ్చింది .

కాగా సురేశ్ చ‌దువు మ‌ధ్య‌లోనే మానివేసి చెడు వ్య‌స‌నాల‌కు బానిసైన‌ట్లు తెలిసింది. డ‌బ్బుల కోసం సురేశ్ ఇంటికి వెళ్లిన వ‌సంత‌పై కుటుంబ స‌భ్యులు దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్ర‌గాయాలపాలైన త‌మ్మిరెడ్డి వ‌సంత(22) తాడెప‌ల్లిగూడెం ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

కాగా త‌న కుమార్తెకు టీబీ టాబ్లెట్స్ ఇచ్చి చంపేశార‌ని బందువులు ఆరోపించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button