క్రైమ్

ఏటీఎం చోరీ – గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి, (క్రైమ్ మిర్రర్): జీడిమెట్ల మార్కండేయ నగర్‌లో మంగళవారం రాత్రి దొంగలు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏటీఎంను దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో ధ్వంసం చేసి, క్యాష్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలానగర్ ఏసీపీ జీడిమెట్లలో కాటన్ సర్చ్ నిర్వహించారు. సమీప ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు జరిపారు. దుండగులు అదే పరిసరాల్లో ఉండి ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, త్వరలో నిందితులను పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button