
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- అల్లు అర్జున్ హీరోగా రాబోతున్నటువంటి AA22 పై ప్రతి ఒక్కరు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా ఒక సినిమా రాబోతుంది. అయితే తాజాగా డైరెక్టర్ అట్లీ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. AA22 సినిమా ద్వారా ప్రతి ఒక్కరు కూడా కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసే ప్రేక్షకుడు ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచం సృష్టిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఈ మూవీ ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. భారీ బడ్జెట్, స్టార్ నటులు ఉన్నటువంటి ఈ సినిమా ప్రాజెక్టును చూసి ఎక్కడ కూడా భయపడట్లేదని… ఈ సినిమా అసలు రిస్కే అనుకోవట్లేదని.. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నామని డైరెక్టర్ అట్లీ వివరించారు. మరో కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు మేము నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మరికొద్ది నెలల పాటు వేచి చూడాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ప్రపంచ స్థాయిని చాటి చూపేలా ఉంటుందని అర్థం అవుతుంది. అట్లీ చేసిన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పుష్ప టు సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా బాహుబలి కలెక్షన్లు కూడా దాటి మరో రికార్డు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.
Read also : రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది..!
Read also : దెబ్బ అదుర్స్ కదా… సోషల్ మీడియాలో ట్రోలింగ్!