అంతర్జాతీయం

భారత్ లక్ష్యంగా మరోసారి రెచ్చిపోయిన అసీం మునీర్..!

క్రైమ్ మిర్రర్,అంతర్జాతీయ న్యూస్ :- తాజాగా పాకిస్తాన్ దేశం తొలి రక్షణ దళాల చీఫ్ గా అసీం మునీర్ ను నియమించింది. పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి ఈ అసీం మునీర్ తాజాగా రక్షణ దళాల చీఫ్ గా నియమితులైన తర్వాత కూడా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని మరోసారి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏదైనా దాడి జరిగితే మాత్రం దానికి ప్రతిస్పందన పాకిస్తాన్ మరింత వేగంగా, తీవ్రంగా చేస్తుంది అని అన్నారు. గతంలో కూడా అసీం మునీర్ న్యూక్లియర్ వాతావరణం లో యుద్ధాలకు అసలు చోటు లేదు అని భారత మిలటరీ నాయకత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాను అని కూడా వ్యాఖ్యానించారు. కావాలని దాడులు చేస్తే ఊహించని స్థాయిలో బదిలిస్తామని అసిం మునీర్ హెచ్చరించారు.

Read also : ఇవి పంచాయతీ ఎన్నికలా లేక ఎమ్మెల్యే ఎన్నికల!.. ఏంది ఈ జోరు?

ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చేసుకున్నా నేపథ్యంలో ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో ఎన్నోసార్లు అణుబాంబు బెదిరింపులు కూడా చేయగా అసలు ఈ మనిషిని ఎలా వదిలి పెడుతున్నారు అని భారత ప్రజలు మన ఆర్మీ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కావాలని రెచ్చగొడుతుంది అని.. యుద్ధం జరిగితే పాకిస్తాన్ రూపు రేఖలు లేకుండా చేయాలి అని భారత ప్రజలు ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఈసారి ఇరుదేశాల మధ్య యుద్ధం జరిగితే ఖచ్చితంగా ప్రపంచ పటంపై పాకిస్తాన్ లేకుండా చేయాలని భారత నెటి జనులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి కొంతమంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని.. పాకిస్తాన్ కు కౌంటర్లు వేస్తున్నారు.

Read also : బాలకృష్ణ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. 12వ తేదీన విడుదల?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button