
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాక్షి పత్రిక, టీవీ ద్వారా ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒక పార్టీ అధినేతగా తమ నాయకులను క్రమశిక్షణలో ఉంచుకోవాలని జగన్మోహన్ రెడ్డికి సూచించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యపై కూడా వైసీపీ పార్టీ తప్పుడు కథనాలు సృష్టించింది అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. “సాక్షి మీడియాను నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే” అని అన్నారు. అలాగే అధికారంలో ఉన్న నాయకులపై వ్యక్తిత్వహన వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఊరుకోరు అని… అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని ప్రోత్సహించడం జగన్ తప్పు అని చంద్రబాబు నాయుడు అన్నారు.
Read also : అమెరికా యాక్షన్.. రష్యా రియాక్షన్.. ఇరు దేశాల మధ్య కొత్తలొల్లి!
అలాగే ఒకచోట జరిగిన సందర్భంలో వచ్చిన కార్యకర్తలను మరొక చోట జరిగిన కార్యక్రమంలో విఎఫ్ఎక్స్ ద్వారా భారీ జనసంద్రం ఉన్నట్లు చూపించడం ప్రజలను మోసం చేసినట్లేనని వైసీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు పంపారు. ఇలాంటి సందర్భాలు మరోసారి చోటు చేసుకుంటే సహించబోనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మోసం చేయవద్దని చంద్రబాబు నాయుడు కోరారు. కాగా మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన ఎక్కడికి వెళ్ళినా కూడా.. ఎంతోమంది జనం వస్తున్నారు. కానీ అవన్నీ సాక్షి మీడియా ప్రచురిస్తున్న తప్పు ప్రచారమని టీడీపీ తిప్పి కొడుతుంది.
Read also : వల్గర్ గా మాట్లాడిన ఆకతాయిలు.. “చెప్పు తెగుద్ది” అన్న అనసూయ?</a