
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- లిక్కర్ స్కామ్.. వేల కోట్ల కుంభకోణం.. బిగ్‌బాస్ బండారం బయటపెడతాం.. డాం డూమ్ డుష్ అంటూ ఉదరగొట్టారు. తీరా చూస్తే.. అంతసీన్ లేనట్టు.. అంతా సైలెంట్ అయ్యారు. ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ తర్వాత.. ఇంకేముంది.. బిగ్‌బాస్ అరెస్టే మిగిలింది అన్నారు. నేడో, రేపో వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని కూటమి నేతలు కబుర్లు చెప్పారు. ఆ నేడు, రేపు దాటి చాలా రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు చడీచప్పుడు లేదు. అంటే… జగన్ అరెస్ట్ ప్రచారమంతా కూటమి పార్టీల మైండ్ గేమేనా…? అంటూ ఇప్పుడు కొత్త ప్రచారం జరుగుతోంది.
Read also : “అరుంధతి” కోటకు మరమ్మత్తులు చేపట్టాలి?
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు అరెస్టయిన వారి లిస్ట్ పరిశీలిస్తే.. ఒక విషయం అర్థమవుతోంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో జరిగిన పెద్ద అరెస్ట్.. ఎంపీ మిథున్‌రెడ్డిది. ఆపై… ఈ కేసులో రిమాండ్‌లో ఉన్నవారంతూ జగన్ చుట్టూ ఉన్న అధికారులు, వైసీపీ హాయంలో పనిచేసిన సలహాదారులే. ఆ తర్వాత ఈ కేసులో చెప్పుకోదగ్గ అరెస్ట్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిది. ప్రస్తుతం ఆయన కూడా రిమాండ్‌లో ఉన్నారు. పట్టుకున్న డబ్బు కేవలం 11 కోట్ల రూపాయలు. లిక్కర్ కేసుకు సంబంధించిన సిట్ అధికారులు.. మరిన్ని ఆధారాలు సేకరించే బిజీలో ఉన్నారు. ఈలోపు కూటమి నేతలు ఈ కేసును రాజకీయంగా వాడేసుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను కూడా అరెస్ట్ చేసేస్తే.. వైసీపీని చావు దెబ్బ కొట్టినట్టే అని సంబరపడిపోతున్నారు. నేతల్లో ఇలాంటి ఆలోచన ఉన్నా… అధినేత ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టు కనిపిస్తోంది.
Read also : జగన్ అడ్డాలో హై టెన్షన్.. గాయాల పాలైన వైసీపీ ఎమ్మెల్సీ!
లిక్కర్ కేసులో సిట్ వేసిన ఛార్జ్‌షీట్ గమనిస్తే.. అందులో వైఎస్ జగన్ పేరు మాత్రమే ప్రస్తావించారు. అది కూడా నామమాత్రంగానే. జగన్‌ను నిందితుడిగా మాత్రం చేర్చలేదు. ఛార్జ్‌షీట్‌లో జగన్‌ను నిందితుడిగా చేర్చకపోయినా… నేరుగా అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం చేశారు. అయితే.. జగన్‌ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారంలో ఎంత నిజం ఉందో ఏమో గానీ… రోజులు గడిచేకొద్దీ… ఇదంతా కూటమి మైండ్ గేమ్అన్న కొత్త ప్రచారం మొదలైంది. లిక్కర్ స్కామ్‌ను అడ్డుపెట్టుకుని.. రాజకీయంగా వైసీపీని దెబ్బకొట్టాలన్నదే కూటమి ప్రభుత్వం కాదు కాదు… సీఎం చంద్రబాబు ప్లాన్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Read also : BCలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే సహించం : సీఎం రేవంత్