హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. అయితే హైడ్రా యాక్షన్ పై భిన్న వాదనలు వస్తున్నాయి. హైడ్రా కూల్చివేతలను కొందరు సమర్ధిస్తుంటే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలం పన్నులు వసూల్ చేసి ఇప్పుడు అక్రమమని ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తున్నారు. బడాబాబులు, రాజకీయ నేతలను వదిలేసి పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను మాత్రమే కూలుస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై ఓ సామాన్యుడి ఆక్రందన ఇది..
హైదరాబాద్‌కు పునర్వైభవం తేవడానికి హైడ్రా ద్వారా కంకణం కట్టుకోవడం శుభపరిణామం కానీ, ఇళ్లు కూల్చేముందు..
ఆ స్థలం రెసిడెన్షియల్ జోన్ లోకి ఎవడు మార్చాడో?
FTL/బఫర్ జోన్ లో గల ఫ్లాట్స్ కన్వర్ట్ ఎవడు చేశాడో?
అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడో?
అక్కడ ఫీల్డ్ లెవెల్ తనిఖీ ఎవడు చేశాడో?
అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవడో?
అక్కడ ఉన్న రెవెన్యూ అధికారి ఎవడో?
వాటికి పర్మిషన్ ఇచ్చిన సన్నాసి ఎవడో?
ఆ ఇళ్లకు అసెట్ నంబర్స్ ఎవడు ఇచ్చాడో?
ఆ ఇళ్లకు వాటర్ కనెక్షన్ ఎవడు ఇచ్చాడో?
ఆ ఇళ్లకు రోడ్లు, కరెంట్ ఎవడు ఇచ్చాడో?
వాళ్ల దగ్గరనుండి పన్నులు ఎవడు వసూలు చేశాడో?
Read More: అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరా? స్టూడెంట్ ఫోన్‌లో వేలాది న్యూడ్ వీడియోలు
వాటి లెక్క తీసి డబ్బులు తిరిగిచ్చేసి, ఆ సన్నసుల మీద యాక్షన్ తీసుకొని అప్పుడు ఇల్లు కూల్చు!
నెలలకు, నెలలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కళ్లు మూసుకున్న అధికారుల మీద, మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి..?
అక్రమ నిర్మాణాల మీద ట్యాక్స్‌లు వసూలు చేసిన అధికారుల మీద, మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి..?
ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టిన బాధితులకు మీరు ఇస్తున్న పరిహారం ఏమిటి..?
ఇళ్లు అక్రమం అయినప్పుడు వాళ్ళు కట్టిన ట్యాక్సు ఎలా సక్రమం అవుద్ది..?
సామాన్యుడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత హైడ్రాతో పాటు ప్రభుత్వంపై ఉంది.
వాహ్ అన్నా వాహ్ ఏం అన్నా అడిగావ, జనం లో కూడా చైతన్యం రావాలి, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అదికారులను ప్రశ్నించాలి.