
క్రైమ్ మిర్రర్,హుజుర్నగర్:- దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో గ్రామాలకు వెళ్తున్న హుజుర్నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్నగర్ సీఐ చరమంద రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని సూచనలు చేసారు. పండగకు ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు అనగా బంగారం, వెండి వస్తువులు మరియు నగదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచరాదు. సాధ్యమైనంత వరకు బ్యాంకు లాకర్లలో ఉంచడం గాని వెంట తీసుకు వెళ్ళడం గానీ చేయవలెను. మీ ఇంటి మెయిన్ డోర్ కి తాళం వేసి కర్టెన్ ను అడ్డుగా ఉంచవలెను మరియు ఇంట్లో లైట్ వేసి, వరండాలో బట్టలు ఆరేసి ఉంచగలరు. పాలవారికి, పేపర్ వేసే వారికి వద్దని చెప్పగలరు. ఇరుగుపొరుగు వారికి ఇంటిని చూస్తూ ఉండమని చెప్పండి. పండుగలకు ఊరు వెళుతున్నప్పుడు బస్సులు ఎక్కే క్రమంలో, దిగే క్రమంలో మరియు బస్సులలో బ్యాగులు లో నుంచి, జేబులో నుండి విలువైన వస్తువులను దొంగిలించే ప్రమాదం ఉన్నది కావున జాగ్రత్త వహించగలరు. మీ ద్విచక్ర వాహనాలకు వీల్ లాక్ వేసి పార్కు చేయగలరు. మీరు ఒకవేళ ఊరు వెళ్తే అట్టి విషయాన్ని పోలీస్ స్టేషన్ లో తెలపగలరు. మీ ఇంటికి మరియు మీ కాలనిలో కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. పై జాగ్రత్తలను పాటించగలరు దొంగతనాల నివారణలో పాలుపంచుకోగలరని ఈ సందర్బంగా ప్రజలను కోరారు.
Read also : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజి ఆశయాలను సాధించాలి!
Read also : DSC అభ్యర్థులు అలర్ట్.. 25వ తేదీన అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ!