
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఆస్ట్రేలియా ప్లేయర్స్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. కొంతమంది ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్స్ భారత ఆటగాళ్లను ఎగతాళి చేస్తూ వీడియోలను రిలీజ్ చేశారు. ఆసియా కప్ లో భాగంగా భారత్ మెన్స్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ ప్లేయర్లకు శేఖర్ ఇవ్వని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ఆస్ట్రేలియన్ ప్లేయర్లు ఎగతాళి చేశారు. భారత్ ను ఉద్దేశించి.. వీరికి ట్రెడిషనల్ గ్రీటింగ్స్ నచ్చవు. అది వారి బలహీనత. మనం బౌలింగ్ చేయకముందే వారిని కచ్చితంగా ఓడించొచ్చు అని ఈ వీడియోలో యాంకర్ అన్నారు. మరోవైపు క్రికెట్ ప్లేయర్స్ మనం ఆడిన తర్వాత షేక్ హ్యాండ్ బదులు ఇలా చేద్దాం అంటూ చాలా వ్యంగంగా, ఎగతాళి చేసే విధంగా చేతులను అటు ఇటు ఆడిస్తూ భారత క్రికెట్ ప్లేయర్స్, ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే విధంగా చేశారు. ఈ వీడియోలో మ్యాక్స్వెల్, కోన్సటన్ లాంటి ముఖ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అలాగే మహిళలు కూడా ఈ వీడియోలో భాగం పంచుకోవడంతో వీళ్ళపై భారత క్రికెట్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మరియు భారత్ మధ్య యుద్ధం జరిగిన విషయం మీరు మర్చిపోయారేమో… ఆసియా కప్ లో జరిగిన సందర్భాలు అన్నీ కూడా చాలా పర్సనల్ అని.. అవన్నీ మీకు తెలిసినా కూడా ఇలా చేయడం ఏంటని.. ” వీళ్ళకి ఇంత బలుపా” అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత పురుషులు అలాగే మహిళల జట్టు ప్లేయర్స్ గుర్తుంచుకోవాలని… మ్యాచ్ లో ఇండియన్ ప్రతాపం ఏంటో చూపించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకొని మీకు చుక్కలు చూపిస్తారు అని మరి కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Read also : గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచిన మాజీ ముఖ్యమంత్రి
Read also : మోడీ పర్యటన ఎఫెక్ట్… రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!