క్రీడలు

అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆటగాళ్ల?.. సురేష్ రైనా, ధావన్ పై సజ్జనార్ ఫైర్?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై హైదరాబాద్ CP సజ్జనర్ ఈ మధ్య తీవ్రంగా మండిపడ్డారు. ప్రమోషన్స్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి జైల్లో కూడా పడేశారు. అయితే తాజాగా భారత దేశ దిగ్గజ క్రికెటర్లు అయినటువంటి సురేష్ రైనా మరియు శిఖర్ ధావన్ పై కూడా సజ్జనార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి గొప్ప పేరు ఉన్నటువంటి ఆటగాళ్లు కూడా అభిమానాన్ని సొమ్ము చేసుకోవాలని చూసినటువంటి వీళ్ళు ఆటగాళ్లు ఎలా అవుతారు?.. అంటూ ప్రశ్నించారు. బెట్టింగ్ బారినపడి ప్రతిరోజు కూడా ఎంతోమంది యువత ప్రాణాలు బలైపోతున్నది ఇలాంటి పేరు, అభిమానం ఉన్న వాళ్ళ వల్లే కదా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ అనే భూతాన్ని ప్రచారం చేసినటువంటి ఇలాంటి క్రికెటర్లు చనిపోయిన వారికి బాధ్యులు కారా?… అంటూ నిలదీశారు. వీళ్ళు ఏం సెలబ్రిటీలు రా నాయనా?.. అంటూ సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు.

Read also : నాకు ప్రపంచ శాంతి ముఖ్యం.. లేకుంటే ప్రపంచాన్ని పేల్చగలను : ట్రంప్

కాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా ఇండియన్ క్రికెటర్లు అయినటువంటి సురేష్ రైనా మరియు శిఖర్ ధావన్ ఆస్తులను ED అటాచ్ చేసింది. దాదాపు 11 కోట్లకు పైగా విలువైన ఆస్తులను విచారణలో భాగంగా ఫైల్ చేశారు. మరోవైపు ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయడం వెనుక ఏమైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో కూడా ఈడి దర్యాప్తు చేస్తోంది. దీంతో చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి బెట్టింగ్ ప్రచారాలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read also : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button