
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- ఏపీలో రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నా… నాయకులు మాత్రం సీరియస్‌గా తీసుకోవడంలేదు. సొంత కార్యక్రమాలే తప్ప… పార్టీ ప్రోగ్రామ్స్‌పై దృష్టిపెట్టడంలేదు. అధినేతలు ఎంత మొత్తుకుంటున్నా.. ఈ చెవిలో విని.. ఆ చెవిలో వదిలేస్తున్నారు. ఎన్నికలు అయిపోయాయి కదా… నాలుగేళ్ల తర్వాత చూసుకుందాం అనే ధోరణిలోనే ఉన్నట్టున్నారు. అందుకే.. పార్టీ కార్యక్రమాలకు కూడా అతిథుల్లా వచ్చి వెళ్లిపోతున్నారు. ఇలా ఏ ఒక్క పార్టీ వారో కాదు.. ఏపీలోని ప్రధాన పార్టీల్లో చాలా మంది నేతల తీరు ఇదే…? పార్టీ ప్రోగ్రామ్‌కి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. వీరి తీరు పార్టీ కార్యక్రమాలపై ప్రభావం చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
Read also : జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో మెగాస్టార్ చిరంజీవి..?
ఏపీ ఎన్నికలు ఏడాది క్రితమే అయిపోయినా… ఏరోజుకా రోజు కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజకీయం హాట్‌హాట్‌గానే నడుస్తోంది. సూపర్ సిక్స్ హామీలపై ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీస్తూనే ఉంది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో.. మళ్లీ ఎన్నికలకు ఆగడం సరికాదని భావించిన అధికార పార్టీలు.. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక రచించాయి. గత ఏడాది పాలనలో చేసిన మంచిని.. అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. టీడీపీ తొలిఅడుగు పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రోగ్రామ్‌లో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడు పదే పదే చెప్తున్నారు. అయినా.. టీడీపీ నాయకుల్లో చీమకుట్టినట్టు కూడా లేదు. ఏదో వచ్చాం… కాసేపు ఉన్నాం… వెళ్లిపోయాం అన్నట్టు ఉంది టీడీపీ నేతల తీరు. దీంతో.. తొలి అడుగు కార్యక్రమం చాలా ప్రాంతాల్లో నామమాత్రంగానే జరుగుతోంది.
అధికార కూటమిలో ఉన్న మరో పార్టీ జనసేన. ఇక్కడ కూడా అదే తీరు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయటకు వస్తేనే.. జనసేన నేతలు బయటకు వస్తారు. లేదంటే చడీచప్పుడు లేకుండా మౌనంగా ఉండిపోతారు. ఇదివరకు మంత్రి నాదెండ్ల మనోహర్ అప్పుడప్పుడు హడావుడి చేసేవారు. వైసీపీపై విమర్శలు చేసేవారు. ఈమధ్య ఆయన గొంతు కూడా పెద్దగా వినిపించడంలేదు. ఇక.. జనసేనలో మిగిలిన నేతల సంగతి సరేసరే.
Read also : ఇప్పట్లో జగన్ అరెస్ట్ లేనట్టే – వెనక్కి తగ్గిన కూటమి..!
అధికార కూటమిలో పార్టీల తీరు ఇలా ఉంటే.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలోనూ ఇదే తంతు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని… సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోతున్నారు తీరును ప్రజలకు వివరించాలని వైఎస్ జగన్.. నేతలకు హితబోద చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ పేరుతో కార్యక్రమం మొదలుపెట్టినా… కొన్ని చోట్ల ఆయన ఆశించిన స్థాయిలో ప్రోగ్రామ్ జరగడంలేదని సమాచారం. పార్టీలో కీలకమైన నేతలు కూడా.. తన గొంతును బలంగా వినిపంచలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఘాటైన విమర్శలు చేయలేకపోతున్నారు. ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారంతా కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారని అంటున్నారు. అంటే… నాయకులు సొంత కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కార్యక్రమం చేపడితే… అలా వచ్చామా… ఇలా ఫొటోలకు ఫోజులు ఇచ్చామా.. వెంటనే మాయం అయ్యామా.. అన్నట్టు నాయకుల తీరు ఉన్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. ఆయా పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడటం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా మేలుకుని.. పార్టీ కార్యక్రమాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read also: “అరుంధతి” కోటకు మరమ్మత్తులు చేపట్టాలి?