Sunday, March 1, 2026
Homeతెలంగాణఅప్పారెడ్డిపల్లి కొత్త చెరువుపై కబ్జా దందా.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల గర్జన!

అప్పారెడ్డిపల్లి కొత్త చెరువుపై కబ్జా దందా.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల గర్జన!

క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:- మాడ్గుల మండలం, అప్పారెడ్డిపల్లి గ్రామంలోని కొత్త చెరువు కబ్జాకు గురవుతోందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బ్లాక్ వాయిస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీధర్ గోవింద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి మాడ్గుల తహసీల్దార్ వినయ్ సాగర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు పరిధిని కొందరు అక్రమంగా ఆక్రమిస్తున్నారని వారు ఆరోపించారు. గత వారం రోజులుగా గ్రామస్తులు సంబంధిత అధికారులకు పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెరువును కబ్జాదారుల నుండి రక్షించాలని, అక్రమ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులు గ్రామాలకు జీవనాధారమని, భవిష్యత్‌లో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాడ్గుల మండలం అభివృద్ధి పరుగులు

Mutton Curry: మటన్ కర్రీని ఇలా వండి తింటే.. ముక్కతో పాటు చేతి వేళ్లను కూడా వదలరు..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments