
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మారుతి వివాదం లో చిక్కుకున్నారు. నిన్న రాజా సాబ్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ మారుతి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను వేరే వారిలా కాలర్ ఎగరేయను.. ఈ సినిమా అంతకుమించి ఉంటుంది అని.. ఆ కాలర్ ఎగరేయడం అవన్నీ కూడా చాలా చిన్నవి అని డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే వార్ -2 సినిమా సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేశారు. అయితే ఆ సినిమా అంతగా ఆడక పోవడంతో ఎన్టీఆర్ కాలర్ ఎగరేసినా కూడా హిట్ కాకపోవడమేంటి అని చాలామంది ట్రోల్స్ చేశారు. అయితే ఈ సందర్భంలోనే మారుతి జూనియర్ ఎన్టీఆర్ ను పరోక్షంగా అవమానించారు అని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతీ ప్రతి జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. నేను ఎవరిని కూడా అగవరపరచడం నా ఉద్దేశం కాదు.. ఎన్టీఆర్ గారు అలాగే ఆయన అభిమానులందరు పట్ల నాకు చాలా గౌరవం ఉంది అని అన్నారు. నేను మాట్లాడిన ప్రతి విషయం పట్ల దాని వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు మారుతి.
Read also : టమాటా రేట్లను చూసి నోరెళ్ళబెడుతున్న సామాన్యులు!
Read also : శ్రీశైలం లో వెలుగులోకి వచ్చిన ఫేక్ వెబ్ సైట్లు… భక్తులు అలర్ట్!





