ఆంధ్ర ప్రదేశ్

ఏపీ అంబాసిడర్ల లా పని చేయాలి.. సిడ్నీలో లోకేష్ స్పీచ్ వైరల్ !

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- మంత్రి నారా లోకేష్ నిన్న ఆస్ట్రేలియా వెళ్లిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్టుకు చేరుకోగానే మంత్రి నారా లోకేష్ కు మన తెలుగువారు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. తెలుగువారితో కాసేపు ముచ్చటించిన తర్వాత లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయని… కానీ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఉందని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్లలా పనిచేయాలని కోరారు. పెట్టుబడుల విషయంలో పక్క రాష్ట్రాలతో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. పక్క వారు ఎన్నెన్నో మాటలు అంటున్న కూడా నేను ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే… మరోవైపు అవి ఓర్చుకోలేని వారు విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా ఏపీని ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే విధంగా విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Read also : సీఎం సెటైర్లకే సెటైర్ వేసిన వైసీపీ… ఎందులోనంటే?

ఇక google మన ఆంధ్ర ప్రదేశ్ రావడం ఒక ఆరంభం మాత్రమే అని.. త్వరలో ఇంకా ఎన్నో కంపెనీలు ఏపీకి రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మన సీఎం చంద్రబాబు నాయుడు అన్నట్లుగా 2047 వ సంవత్సరంలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుంది అని… మరోవైపు మన నమో మోదీ అన్నట్లుగా భారతదేశం కూడా ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. దీంతో ఆస్ట్రేలియాలో నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీలోని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఏపీకి గూగుల్ రాక పట్ల ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read also : టారిఫ్స్ కాదు ఓయ్… నీ దేశం మీద దృష్టి పెట్టు.. అంటూ నెటిజన్స్ ఆగ్రహం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button