
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని జిల్లాలలో వర్షాలు దంచిపడుతుండగా వాతావరణ శాఖ అధికారులు మరొక షాకింగ్ న్యూస్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని APSDMA పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వాయుగుండం రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర – ఒడిశాలో తీరం దాటి అవకాశం ఉందని.. కాబట్టి నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
నేడు వర్షాలు కురిసే జిల్లాలు :-
1. ప్రకాశం
2. పల్నాడు
3. నంద్యాల
4. కర్నూలు
5. కృష్ణ
6. ఏలూరు
7. ఎన్టీఆర్
8. గుంటూరు
9. బాపట్ల
10. నెల్లూరు
ఈరోజు రేపు ఈ పది జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉదయం మొదలుకొని రెండు రోజులపాటు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటాయని… ఎక్కడ కూడా గ్యాప్ వచ్చే అవకాశం లేదని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని… ఈ వర్షాలు మరో మూడు నాలుగు రోజులపాటు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. బయటికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని కూడా స్పష్టం చేశారు.
Read also : కలెక్షన్లలో OG రికార్డ్… పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటిసారి!
Read also : ప్రజల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి