
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఎలక్షన్ల సమయంలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు శ్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పటికే కొన్ని పథకాలు నెరవేర్చగా… ఆగస్టు 15 నుంచి శ్రీ శక్తి పథకాన్ని అమలు చేయనున్నామని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. నేడు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించడం జరిగింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శ్రీ శక్తి పథకాన్ని అమలు చేయనున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలోని 75% అనగా(8,456) బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
Read also : తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు, ఏపీలో కూడా..
అలాగే ఎటువంటి బస్సుల్లో మహిళలు ప్రయాణించవచ్చు అనేది కూడా మంత్రి తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఈ పథకం త్వరలోనే అమలవుతుందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో దాదాపు 800 రూపాయలు ఆగవుతుందని భావిస్తున్నామని అన్నారు. కాగా ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎలక్షన్ల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారమే కొంచెం ఆలస్యమైనా కూడా మరో వారం రోజుల్లో ఈ పథకం ప్రారంభం కానుంది.
Read also : తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాలు, ఏపీలో కూడా..