క్రైమ్ మిర్రర్ : ఆసీస్ పై సెంచరీ బాదిన యువ ఆల్ రౌండర్ నితీష్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. మైడియర్ నితీష్.. మీరు భారత్ లో ఏ భాగం నుంచి వచ్చారన్నది కాదు.. భారత్ కోసం మీరు ఏం చేశారన్నది మా భారత్ కు గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ మరెన్నో ప్రపంచ రికార్డులు సాధించి, భారతదేశ జెండాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. యువతకు, క్రీడల పట్ల అభిరుచి పెంపొందిస్తూ.. దృఢ సంకల్పంతో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వాలని కోరారు. ఈ సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో తన అసాధారణ సెంచరీతో యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. టీమిండియా తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మైదానంలోకి అడుగుపెట్టిన నితీష్ తన తొలి టెస్ట్ సెంచరీ సాధించడానికి అద్భుతమైన టెక్నిక్, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్ నిపుణులు, అభిమానుల ప్రశంసలను పొందింది.
ఇవి కూడా చదవండి :
- 12 సంవత్సరాల తర్వాత… బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
- పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
- మన్మోహన్ కు భారతరత్న ఇవ్వడంపై పూర్తిగా మద్దతు తెలుపుతాం: కేటీఆర్
- తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!