Uncategorizedఆంధ్ర ప్రదేశ్

రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ – 15శాతం వృద్ధే లక్ష్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయం లాభదాయంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారాయన. టెక్నాలజీని ఉపయోగించుకుని సాగు ఖర్చులను తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో 15శాతం వృద్ధి సాధించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామన్నారు. గ్రోత్‌ ఇంజన్లుగా 11 పంటలను తీసుకున్నామని చెప్పారు. కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తామన్నారు. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కేటాయించి పథకాలు అమలు చేస్తామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు.

7.78లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశామని చెప్పారు. అలాగే 120 కోట్ల రూపాయలు విత్తన రాయితీ బకాయిలు చెల్లించామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని… పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన 16,074.47 కోట్ల బకాయిలను చెల్లించామన్నారు. ఇప్పటివరకు 5 లక్షల 31వేల 987 మంది రైతుల నుంచి 33 లక్షల 32వేల 014 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. అందుకుగాను రైతులకు…7,674.959 కోట్లు చెల్లించామన్నారు. 24 గంటల్లోనే 6,726 కోట్లను … 48 గంటల్లోపు 948 కోట్లను చెల్లించామని చెప్పారు.

వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా…

పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవకు: రూ.9,400 కోట్లు
పంట రుణాల వడ్డీ రాయితీకి – రూ.250 కోట్లు
వ్యవసాయ యంత్రాల రాయితీకి – రూ.139.65 కోట్లు
ఎరువుల నిర్వహణకు- రూ.40కోట్లు
ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహకానికి – రూ.61 కోట్లు
డ్రోన్ల రాయితీకి – రూ.80కోట్లు
భూమి లేని రైతులకు ఏడాదికి-రూ.20వేలు
వ్యవసాయశాఖకు – రూ.12,401 కోట్లు
ఉద్యానవన శాఖ – రూ.930.88 కోట్లు
పంటలభీమా – రూ.1,028కోట్లు
పట్టుపరిశ్రమ అభివృద్ధికి – రూ.96.22కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు – రూ.315 కోట్లు
సహకార శాఖకు – రూ.239.85 కోట్లు
పశు సంవర్ధక శాఖ – రూ.1,112 కోట్లు
మత్స్యరంగం అభివృద్ధికి – రూ.540 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button